రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్లు చేశారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు వాహనదారులు వీడియో తీసి ట్విట్టర్ లో సోషల్ మీడియాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ 8 మంది యువకులను అదుపులకు తీసుకొని, పోలీసులకు అప్పగించారు. వీరిలో కొంత మంది మైనర్ లు ఉన్నట్లుగా రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ రాజేంద్ర గౌడ్ పేర్కొన్నారు