కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఇటీవల పదవతరగతి విద్యార్దిని అదృశ్యం కేసు, తదనతరం చోటు చేసుకున్న పరిణామాలతో ప్రిన్సిపాల్ డి. శారద, ఉపాధ్యాయని లోవ కుమార్‌లను అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను నిరశిస్తూ.. తరగతులను బహిష్కరించిన విద్యార్ధినిలు రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. సస్పెండ్‌కు గురై పాఠశాల నుంచి వెళ్తున్న ప్రిన్సిపాల్‌ను వెళ్లొద్దంటూ విద్యార్ధినీలు అడ్డుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఓ విద్యార్ధిని చేసిన పనికి తమ టీచర్లను బలిచేయవద్దని విద్యార్ధినిలు కోరారు.