అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురైంది. తిమ్మగాని పల్లి దగ్గర చైతన్య ఈ టెక్నో బస్సు చక్రం ఊడిపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది విద్యార్ధులున్నారు. ఊడిన చక్రం 500 మీటర్ల దూరంలో పడడంతో విద్యార్ధులు తోసుకుంటూ రావడాన్ని కొంతమంది వీడియో తీసి వైరల్ చేశారు. ఫిట్నెస్ లేని బస్సులను స్కూల్ పిల్లల కోసం ఉపయోగించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.