ఏలూరు జిల్లా చింతలపూడిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థి మారుముళ్ళ ఆనంద్ కుమార్ పై గుర్తుతెలియని విద్యార్థులు బ్లేడుతో దాడి చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆనంద్ కుమార్ పీక మీద బ్లేడ్‌తో కోశారు. ఆనంద్ కేకలు వేయడంతో లేచిన తోటి విద్యార్ధులు చింతలపూడి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.