ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కుక్కల నివారణకి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకి తావిస్తుంది. నల్లజాలమ్మ వీధిలో... ఓ ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేశాయి. ఒకే కుటుంబానికి చెందిన 3ఏళ్ల పాప, 10 ఏళ్ల బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటీన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిన్ దుకాణాల నిర్వాహాకులు, వేస్ట్ ని ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్కల నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదని, రోజు రోజుకి వాటి సంతతి విపరీతంగా పెరిగిపోతుందని... స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.