హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నేరెళ్లలో సర్పంచ్ అభ్యర్థులు శ్రీరామ్, నాగలక్ష్మి వినూత్న ప్రచారం చేపట్టారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అభ్యర్థులు తమ అనుచరులతో ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ చేయించి గ్రామంలోని కోతులను తరిమేశారు.