చియన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర శూరన్’ చిత్రం గురువారం సాయంత్రం విడుదలైంది. అయితే ఈ సినిమా చూడడానికి హీరో విక్రమ్ చెన్నైలోని ఓ థియేటర్‌కి వెళ్లారు. మూవీ చూసిన అనంతరం విక్రమ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. దీంతో థియేటర్ బయటకు వచ్చిన విక్రమ్ తన కారును ఎక్కకుండా.. ముందుకు వెళ్లి ఆటోలో ఇంటికి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.