గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కర్నూలులోని సన్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ రీసర్చ్ ప్రైవేటు లిమిటెడ్ కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీడీయు-జీకేవై ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో యువతకు జనరల్ డ్యూటీ, అసిస్టెంట్ ట్రైనీ, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశలుకల్పిస్తామని సెంటర్ నిర్వాహకులు తెలిపారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని శిక్షణ లో హాస్టల్, భోజనము ఉచితంగా ఉంటుందని.. యువతి యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.