బాపట్లలోని శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆయన ప్రసంగించారు. కార్తీకమాసంలో ప్రతి ఒక్కరూ దీపం పెట్టి పూజలు చేయాలని, దీనివల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుందని ఆయన అన్నారు. మనం భక్తితో పూజలు చేయడం వలన మన సంస్కృతి, సాంప్రదాయాలను రాబోయే తరాలకు అందించిన వారమవుతామని మహాస్వామి భక్తులకు ఉద్భోధించారు.