సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం బడంపేటలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని కుమారుడు హత్య చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి బండమీది గోప్యమ్మను కుమారుడు బాలరాజు తలపై గొడ్డలితో కొట్టి హతమార్చాడు. గోప్యమ్మ అరవడంతో బాలరాజు అక్కడ నుంచి పరారయ్యాడు. గత కొన్నాళ్లుగా ఏ పని చేయకుండా బాలరాజు జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిస అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించి ఘటనపై కోహీర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.