ప్రస్తుతం తెలంగాణలో ఏ పల్లె చూసినా పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని పల్లెలు మాత్రం పంచాయతీ ఎన్నికలకు నోచుకోవడం లేదు. సర్పంచ్ రిజర్వేషన్ల ఖరారులో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, ఎస్టీ జనాభా లేని గ్రామాలను కూడా ఆ వర్గాలకు కేటాయించారు. కొన్ని గ్రామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్టీలకు రిజర్వ్ చేసినా ఆ వర్గానికి చెందినవారు లేకపోవడంతో ఒక్క నామినేషన్ కూడా పడటంలేదు. దీంతో నిర్మల్ జిల్లా పెరికపల్లి, ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి, మంచిర్యాల జిల్లా నెల్కి వెంకటాపూర్ సహా పలు గ్రామాల్లో ఎలక్షన్స్ ఆగిపోయాయి.