మెదక్ జిల్లా హావేలి ఘనాపూర్ మండల కేంద్రం శివారులో కొందకు వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు దిగారు. గ్రామంలోని రైతు సిద్ధమ్మకు కొందరితో భూ వివాదం ఉంది. ఈ నేపథ్యంలో భూ వివాదంపై మెదక్ జిల్లా కోర్టు నుంచి సిద్దమ్మ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో పొలం దగ్గర సిద్దమ్మ సహా ఆమె కుటుంబీకులను ప్రత్యర్ధులు తుపాకీతో బెదిరించారు. భూమి వద్దకు వస్తే తుపాకీతో కాల్చి పారేస్తానంటూ బెదురింపులకు దిగారు. దీంతో సిద్ధమ్మ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.