నిర్మల్ రూరల్ మండలం లోని కేజీబీవీ విద్యాలయంలో పాములు కలకలం రేపాయి. పాములు సంచరిస్తుండడంతో ఆందోళనకు గురైన సిబ్బంది స్నేక్ క్యాచర్ మహమ్మద్ ఫిరోజ్‌కు సమాచారం అందించారు. స్కూల్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్ ఐదు పాములను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. చలికాలంలో పాములు బయటకు వస్తాయని, వాటిని చూసి భయపడకుండా, చంపకుండా అధికారులకు సమాచారం అందించాలని ఫిరోజ్ సూచించారు