ఆస్ట్రేలియాలో ఒక పాము కారణంగా ఓ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టు నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే విమానంలోకి విషపూరితమైన పాము దూరింది. విమానంలో ప్రయాణికుల సామాన్లు భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్ క్యాచర్‌ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.