భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్మృతి హల్దీ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహచర క్రికెటర్లు హాజరై సందడి చేశారు.