తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులను, డ్రైవర్ కండక్టర్లను పరుగులు పెట్టించింది. కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుంచి ఏలూరు వెళుతుండగా ఓవర్ లోడ్ కారణంగా దేవరపల్లి బస్టాండ్ వద్ద మొరాయించింది. బస్సు కెపాసిటీ 60 మంది ప్రయాణికులు కాగా సుమారు బస్సులో వందమంది పైనే ఉండగా బస్సును స్టార్ట్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించిన సమయంలో ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలయ్యాయి.. అదే సమయంలో బస్సు ఇంజన్లో నుంచి కూలెంట్ ఆయిల్ లీకై రోడ్డు మీదకి ప్రవహించింది... దీంతో కంగారు పడ్డ డ్రైవర్ బస్సు ఫైర్ అవుతుందని భావించి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు.. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సులోంచి కిందికి దిగారు.. బ్రతుకు జీవుడా అంటూ ప్రయాణికులు అందరూ దేవరపల్లి బస్టాండ్ లోకి చేరారు.. బస్సు ఆగిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి బస్సు డ్రైవర్ బస్సును దేవరపల్లి బస్టాండ్ లో నిలిపివేశారు.