15 వేల అడుగుల ఎత్తులో స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగానికి చిక్కుకొని గాల్లోనే వేలాడిన ఘటన దక్షిణ కెయిర్న్స్లో జరిగింది. సమయానికి రెండో పారాచూట్ విప్పడంతో స్కైడైవర్ సురక్షితంగా దిగగా, పైలట్ విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశాడు. అధికారులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.