గత మ్యాచ్ సమయంలో డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. నేను పోర్చుగల్ జట్టు అభిమానిని. అక్కడ క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. దీంతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. జీవితం అంచనాలకు అందనిది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చాలా వాటి గురించి ఫైట్ చేస్తాం. కానీ, రేపు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. లైఫ్‌కు ఎప్పుడూ గ్యారంటీ ఉండదు.