పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం జే సికిలీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని భవాని మాల ధరించి స్కూలుకి రావడంతో ఆ విద్యార్థిని యాజమాన్యం స్కూల్ లోనికి అనుమతించలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, భవానీ మాలధారులు పెద్ద ఎత్తున స్కూల్ దగ్గరకు చేరుకుని ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పకపోవడంతో స్కూల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. స్కూల్ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని మాలధారులు డిమాండ్ చేశారు.