వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో భక్తులను మోసం చేసే దళారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విఐపి దర్శనాల పేరిట భక్తుల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి వెల్లడించారు. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. భక్తులు ప్రైవేట్ వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, కేవలం ఆలయ కౌంటర్లలోనే టికెట్లు కొనుగోలు చేయాలని సూచించారు.