నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు శ్రీ సత్యసాయిబాబా ప్రేమవాహిని రథం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా భక్తుల బైక్ ర్యాలీ, విద్యార్థుల కోలాటాలు, మహిళల మంగళహారతులతో సాయి భజనలు, సాయినామస్మరణలతో కొల్లాపూర్ పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. బాబా ఆశీస్సులు కోటి మంది భక్తులకు చేరాలని.. ఏప్రిల్ నెలలో సాయి శతజయంతి ఉత్సవాలలో భాగంగా పుట్టపర్తిలో ప్రేమవాహిని రథం బయలుదేరి 5 జిల్లాలో భక్తుల దర్శనం కోసం వచ్చిందని, గ్రామగ్రామానా భక్తులు సత్యసాయి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశామని సత్యసాయి సేవ సమితి సభ్యులు తెలిపారు.