సేవే పరమావధి అని సత్య సాయి బాబా చేసిన బోధనలను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలని.. రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. సమాజంలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి సాయిబాబా చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సత్య సాయి బాబా శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి.. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.