ప్రముఖ పుణ్యక్షేత్రం.. శ్రీకాళహస్తీశ్వర స్వామిని.. విదేశీయులు దర్శించుకున్నారు. 29 మంది రష్యన్ దేశస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు నిర్వహించారు. వీరికి శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని గురు దక్షిణామూర్తి దగ్గర.. వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదం ఇప్పించి స్వామి అమ్మ వాళ్ళ తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు.