తప్పులు చేసిన 400 మంది ఉద్యోగులను TGSRTC యాజమాన్యం తొలగించింది. వారంతా తాజాగా ప్రెస్మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తమను అన్యాయంగా ఉద్యోగంలోంచి తొలగించారని ఓ మహిళా కండక్టర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సజ్జనార్ మాపై పడ్డారు. చిన్న చిన్న పొరపాట్లకు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించి.. మా కుటుంబాలను రోడ్డున పడేశారు” అని భావోద్వేగానికి లోనయ్యారు.