కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని తెన్నేరుకు చెందిన తేజ అనే మహిళ.. ఉప్పులూరు రైవాస్ కాలువలో దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న గన్నవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు ఆమెను గమనించాడు. దీంతో బస్సును అక్కడే ఆపి కాల్వలోకి దూకి మహిళను రక్షించాడు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనూ సమయస్ఫూర్తిగా ఆలోచించి ఓ మహిళ ప్రాణం కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ను సిబ్బంది, ప్రయాణికులు అభినందించారు.