కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివ పల్లి క్రాస్ రోడ్ దగ్గర లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా వరంగల్ వెళుతున్న ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు ఢీ కొట్టింది.. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు ముందు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. ఈ ప్రమాదంలో గాయపడ్డ ప్రయాణికులను కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు..