SA20 లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఒక అభిమాని పట్టిన వన్ హ్యాండ్ క్యాచ్ అతని అదృష్టాన్ని మార్చేసింది. MI కేప్‌టౌన్ బ్యాటర్ రికెల్టన్ కొట్టిన బంతిని స్టాండ్స్‌లో ఒంటి చేత్తో క్యాచ్ పట్టడంతో, అతను రూ. 1.08 కోట్లు (2M రాండ్స్) గెలుచుకునే అవకాశం దక్కించుకున్నాడు. సీజన్ ముగిసేలోపు వేరెవరూ ఇలా క్యాచ్ పట్టకపోతే, ఈ భారీ నగదు బహుమతి మొత్తం అతనికే సొంతమవుతుంది.