ఏలూరు కొత్తపేటలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న ఇద్దరు యువతులపై రౌడీషీటర్లు భవానీకుమార్, జగదీష్ బాబులు దాడి చేశారు. వారిలో ఒక యువతిని బయటకు లాక్కెళ్లిన రౌడీషీటర్ జగదీష్‌బాబు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన జరగగా..మరుసటి రోజు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళడంతో హడావుడిగా కేసునమోదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యచేపట్టామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు.