కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడేకల్లు ప్రాథమిక పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడి పోయాయి. పెచ్చులూడుతున్న గదుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ప్రస్తుతం పాఠశాలలలో 487 మంది విద్యార్థుల చదువుకుంటున్నారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఐదు తరగతులను 15 సెక్షన్లుగా విభజించారు. పాత భవనంలో ఆరు గదులు పెచ్చులూడి శిథిలమయ్యాయి. గదులు సరిపోక విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి ఉపాద్యాయులు పాఠాలు చెబుతున్నారు.