టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మాజీ సహచరుడు అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో ముంబైలోని శివాజీ స్టేడియంలో శుక్రవారం రెండు గంటల పాటు సాధన చేశాడు.