బెంగళూరులో జరిగిన 7 కోట్ల దోపిడీ కేసులో, నిందితుడు కూర్మాయిపురం వాసి నవీన్‌ను కర్ణాటక పోలీసులు గుర్తించారు. కుప్పం పోలీసుల సహాయంతో నవీన్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో, తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో దాచి ఉంచిన సుమారు 5.56 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ డబ్బు రికవరీ చేసిన ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచి, దర్యాప్తు చేస్తున్నారు.