అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడి సమీపంలో గోదావరి నదిపై తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో బూరుగు లంక పెదపూడి లంక అరిగెల వారి పేట ఊడిమూడి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు.