AP: అందరూ కార్లు, బైక్‌లపై తిరుగుతున్న ఈ కాలంలో. బాపట్ల జిల్లాలో ఆరు పదుల వయసులోనూ ఓ వ్యక్తి ఎక్కడికైనా గుర్రంపైనే వెళ్తున్నారు. 61 ఏళ్ల లక్ష్మారెడ్డి గుర్రంపై స్వారీ చేస్తూ యువతను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. పొలం మార్కెట్. ఎక్కడికి వెళ్లాలన్నా ఆయన వాహనం అశ్వమే. తనకు చిన్ననాటి నుంచి గుర్రంపై ప్రయాణించడమంటే చాలా ఇష్టమని లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ వయసులోనూ తాను ఆరోగ్యంగా ఉండటానికి గుర్రపు స్వారీయే కారణమని ఆయన సంతోషంగా చెబుతున్నారు.