ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రభావంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. గత నెల నవంబర్ నెలలో ద్వారక తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు..కొయ్యలగూడెం మండలానికి చెందిన నాలుగు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని ఆ గ్రామ ప్రజలు ఫ్లెక్సీల ద్వారా ఆయన దృష్టికి తెచ్చారు. తమ గ్రామానికి వెళ్లడానికి సరైన దారి లేక పడుతున్న ఇబ్బందులను ప్రజలు పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను ఆపి మరీ వివరించారు. ప్రజల వినతిని స్వీకరించిన డిప్యూటీ సీఎం వెంటనే స్పందిస్తూ, ఈ నాలుగు గ్రామాల రోడ్డు నిర్మాణానికి 7 కోట్ల 60 లక్షలు మంజూరు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.