సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన పులి వెంకటేశ్వర్లుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో ఇంకా ఐదు నెలల పదవీ కాలం ఉండగానే స్వచ్ఛంద విరమణ తీసుకున్న వెంకటేశ్వర్లు....కేవలం పది ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. గ్రామాభివృద్ధి కోసం పోటీ చేసిన ఆయనకు స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి స్వయంగా మద్దతు తెలిపినా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ రెబల్‌గా నామినేషన్ వేసిన నాగయ్య చివరి క్షణంలో ఆధిక్యం సాధించి విజయం సాధించారు.