కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్ వద్ద ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి ఆదోని జిల్లా సాధనే ఏకైక పరిష్కారమని జేఏసీ కన్వీనర్ రామతీర్థం అమరేశ్, రాయలసీమ సాధన సమితికి చెందిన బొజ్జ దశరథ రామిరెడ్డి అన్నారు. తమ ప్రాంతాన్ని పాలకులు విస్మరించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ఉపాధి లేక వలస పోతున్నారని, మెరుగైన విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధి జరగాలంటే ఆదోని జిల్లాగా ప్రకటించాలని దీక్షలో పాల్గొన్నవారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.