ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో గిరిజన రైతులపై దాడి చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించుకుంటూ ఆర్డీవో కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు. ఆర్డీవో కార్యాలయం గేట్లు మూసివేయడంతో ఉద్రిక్తత వాతావరణం మధ్య గేట్లు తోసుకొని కార్యాలయంలోనికి ప్రవేశించి ధర్నా చేపట్టారు. బుట్టాయిగూడెం రెవెన్యూ పోలీస్ అధికారులు గిరిజనులపై యుద్ధం ప్రకటించారని.. పోలీసులు గిరిజన ఆడవారిపై దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట చేతికొచ్చే సమయానికి అధికారులు నిర్లక్ష్య ధోరణతో పంటను ధ్వంసం చేయడమే కాకుండా అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.