అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రేషన్ డీలర్ చేతివాటం ప్రదర్శించాడు. రేషన్ సరుకుల కొలతల్లో ఒక్కొక్క రేషన్ కార్డుకు కేజీ నుంచి 2 కేజీల వరకు తక్కువ చేస్తూ మోసానికి పాల్పడ్డాడు. తమకు రేషన్ తక్కువ రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. రేషన్ డీలర్ కోత విధిస్తున్నట్టు గుర్తించారు. ఇదేంటని కార్డుదారులు అడిగిన ప్రశ్నకు డీలర్ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రేషన్ డిపోలో జరుగుతున్న మోసాన్ని గ్రామస్తులు వీఆర్వోకి ఫిర్యాదు చేశారు. గతంలోనూ డీలర్ మోసాలకు పాల్పడ్డాడని.. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.