విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత మహిళా క్రికెట్ దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మిథాలీ రాజ్ పేరును స్టేడియంలోని ‘ఏ-గ్యాలరీ’కి నామకరణం చేశారు. అదేవిధంగా, స్టేడియంలోని మూడో నంబర్ గేటుకు మాజీ వికెట్ కీపర్ రావి కల్పన పేరును పెట్టారు.