చిత్తూరు జిల్లా రామకుప్పం–ననియాల తండా సమీపంలో రాత్రి సమయంలో రెండు ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళనలకు గురవుతున్నారు. వరిచేలల్లోకి ఏనుగులు రావడంతో.. రైతులు అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అటవీ సిబ్బంది.. ఏనుగులను అడవి వైపునకు మళ్లించారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లొద్దని.. ఏనుగుల సంచారంపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను అధికారులు హెచ్చరించారు