ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. కళాశాలలో సెకండియర్ విద్యార్థులను థార్డియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. దీంతో సెకండియర్ విద్యార్థులు ఎదురుతిరగడంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రాత్రి 11 గంటల సమయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.