పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నూతన డిఎస్పీగా రఘువీర్ విష్ణు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు చర్చించారు. నియోజకవర్గవ్యాప్తంగా అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు, ఇప్పటికే నాలుగు పోలీస్ స్టేషన్లు ,ఆకివీడు సీఐ కార్యాలయానికి కొత్త వాహనాలను సమకూర్చినట్లు రఘురామ ఈ సందర్భంగా డిఎస్పీకి వివరించారు. భీమవరం డివిజన్ పరిధిలో శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా విధులు నిర్వహించాలని, ప్రజలకు రక్షణగా నిలవాలని డిఎస్పీ రఘువీర్ విష్ణుకు రఘురామకృష్ణరాజు సూచించారు.