జగిత్యాల పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం వద్ద శనివారం రాత్రి భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, అటవీ శాఖ అధికారులకు తెలిపారు. అటవీ సిబ్బంది కొండచిలువను సురక్షితంగా పట్టుకొని, దానిని తిరిగి అడవిలో వదిలిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.