ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ప్రజల నుండి వారి సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రజలు ప్రధానంగా పింఛన్, భూ వివాదాలు తదితర సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ ప్రజా దర్బార్లో నియోజకవర్గానికి చెందిన అధికారులు, నాయకులు కూడా పాల్గొని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.