ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాల ఎంపిడివో కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరయ్యారు. ఎమ్మెల్యే కొండయ్య ప్రజల వద్ద నుండి స్వయంగా సమస్యల వినతుల అర్జీలను స్వీకరించారు. మొత్తం 200కి పైగా అర్జీలు రాగా వీటిలో ,ఇంటి స్థలాల కోసం,పింఛన్లు పలు సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు.