ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ సెంటర్లో సైకో హల్చల్ చేశాడు. చాకు తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సైకోను పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.