పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. వీధుల్లో వెళ్తున్న చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని, చేతిలో కత్తితో వారిని వెంటాడుతూ చంపేస్తానంటూ భయాందోళనకు గురిచేశాడు. చిన్నారులపై దాడి చేసేందుకు యత్నిస్తున్న సదరు వ్యక్తిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే తిరుమల రోడ్లపై ఈ ఘటన జరగడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.