నిత్యం ఏదొక ప్రాంతంలో ప్రైవేట్ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న మార్నింగ్ స్టార్ బస్సు.. పెళ్లకూరు మండలం దొడ్లవారి మిట్ట జాతీయ రహదారిపై బోల్తా పడింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కావడంతో వారిని నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.