తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రులో ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు మినహా పెను ప్రమాదం తప్పింది. తాడిపర్రులోని ప్రైవేటు పాఠశాల బస్సు కానూరు అగ్రహారంలో బయలుదేరి ఉసులుమర్రు మీదుగా తీపర్రు చేరుకుంది. అక్కడ ఏటి గట్టు నుంచి మలుపు తిరిగి దిగువకు వస్తుండగా అదుపుతప్పడంతో బోల్తా పడింది. బోల్తా పడిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమై వీరందరిని బయటకు తీశారు.