మధ్య ప్రదేశ్‌లోని సాగర్‌లో విమాన ప్రమాదం జరిగింది. ట్రైనీ నడుపుతున్న ప్రైవేట్ విమానం అదుపుతప్పి క్రాష్ ల్యాండింగ్ అయింది. అక్కడున్న సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని కాక్‌పిట్‌లో ఇరుక్కుపోయిన పైలట్‌ను బయటికి తీశారు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇటీవల దుబాయ్ ఎయిరోలో తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలడంతో పైలట్ మరణించిన విషయం తెలిసిందే.